'కియా' డంపింగ్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం..

అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Samba Siva Rao
Published on: 26 April 2020 8:03 PM IST
కియా డంపింగ్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం..
X

అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫైర్ స్టేషన్ మేనేజర్ పరమానందం(38) మృతి చెందారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

విధులు నిర్వహిస్తూ సిబ్బంది మంటలను అదుపు చేయబోయడానికి వెళ్లారు. మంటలు భారీ ఎత్తున ఎగసి పడడంతో దట్టంగా పొగలు వ్యాపించడంతో.. అగ్నిమాపక ఉద్యోగి అస్వస్థతకు గురైయ్యారు. ఫైర్ మేనేజర్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story