ఏపీలో ప్రారంభమైన ఐదో విడత రేషన్ సరుకులు బియ్యంతో పాటు కందిపప్పు పంపిణీ

ఏపీలో ప్రారంభమైన ఐదో విడత రేషన్ సరుకులు బియ్యంతో పాటు కందిపప్పు పంపిణీ
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ ఐదో విడత నేడు ప్రారంభమయ్యింది.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ ఐదో విడత నేడు ప్రారంభమయ్యింది. ఇప్పటికే నాలుగు విడతలుగా పూర్తి చేసిన అధికారులు ఐదో విడతగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా రేషన్ కార్డులు ఉన్న వారికి ఒకరికి 5 కిలోల బియ్యం, కేజీ కంపప్పు పంపిణీ చేస్తుండగా.. రాష్ట్రంలోని 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. రేషన్ తీసుకునే వారికి షాపుల వారీగా కూపన్లు పంపిణీ చేయగా.. పోర్టబిలిటీ ద్వారా.. ఏ జిల్లాలో ఉంటె ఆ జిల్లాలో రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. బయోమెట్రిక్ ద్వారా లబ్ధి దారులకు రేషన్ ఇవ్వనున్నారు.

కాగా.. ఏపీలో మర్చి 29 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పేదలకు నాలుగు విడతలుగా ఉచితంగా సరుకులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతీసారి లబ్దిదారులకు టైం స్లాట్ ఉన్న కూపన్లను ఇస్తారు. అవి తీసుకుని కార్డుదారులు సంబంధిత రేషన్ షాపులకు వెళ్లి సరుకులను తీసుకుంటుంటారు. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి రేషన్ దుకాణాల వద్ద తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మొదటి విడతలో భాగంగా ఉచిత సరుకులు పంపణీ చేసినప్పుడు షాపుల వద్దే ఇవ్వడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చే నగదు రూ. 1,000లను వాలంటీర్ల ద్వారా పంచి, రేషన్ సరుకులు షాపుల వద్ద ఇవ్వడంతో కరోనా వైరస్ వ్యాప్తికి ఆస్కారం కలిగే విధంగా ఉందంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేఫధ్యంలో రెండో విడతగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరుకులను పంపిణీ చేశారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల కార్డులున్న వారంతా ఉచితంగా ఇస్తున్న సరుకులు తీసుకున్న కారణంగా వేలల్లో లబ్ధిదారులు అదనంగా నమోదయ్యారు. దీనిపై ఆలోచించిన ప్రభుత్వం మరలా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే బయోమెట్రిక్ వేసే సమయంలో శానిటైజర్ వాడి వేలి ముద్రలు వేసేలా డీలర్లు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు లబ్దిదారులకు సమయాన్ని కేటాయిస్తూ స్లిప్పులు ఇవ్వడం వల్ల ఆ సమయానికి వచ్చి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు.




#Lockdown, #Ration Distribution, #Andhra Pradesh




Show Full Article
Print Article
Next Story
More Stories