Visakhapatnam: ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికొడుకులు

Visakhapatnam: *ఆటలు నేర్పిస్తామంటూ అకృత్యాలకు పాల్పడిన నిందితులు *చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు

Shireesha
Updated on: 14 Sept 2021 6:45 PM IST
Father and Son Molested Minor Girls in Pudimadaka Village Visakhapatnam | Telugu Online News
X

ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికొడుకులు

Visakhapatnam: మళ్లీ అవే ఘటనలు.. అదే తీరు.. చట్టాలు ఎన్ని వచ్చినా.. ఎంత మందికి శిక్షలు పడుతున్న.. కొంతమంది దుర్మార్గుల మైండ్ మాత్రం మారడం లేదు. ఒక ఘటన మరవక ముందే.. మరో ఘటన.. పశువాంఛతో మనుషుల మధ్యే ఉంటూ.. క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చిన్నారి హత్య ఘటనపై తెలుగు సమాజం అట్టుడుకిపోతోంది. నిందితుడిని తొందరగా పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరవక ముందే.. ఇప్పుడు విశాఖలో మరోఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మానవ మృగాలు అదే గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యాలను పాల్పడ్డారు. విషయం బయటకు చెప్తే.. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.

మాయమాటలు చెప్పారు... ఆటలు నేర్పస్తామంటూ స్వీట్‌గా మాట్లాడారు. ఆ మాటలు నమ్మి వెళ్లిన చిన్నారులపై తండ్రి కొడుకులు అఘాయిత్యం చేసిన ఘటన విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం పూడిమడక గ్రామంలో చోటు చేసుకుంది. నిందితులు అదే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులను వైద్య పరీక్షల కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.

Shireesha

Shireesha

Next Story