Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: లారీ-కారు ఢీ, నలుగురు యువకులు మృతి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Sept 2024 11:01 AM IST
Fatal road accident in Anantapur
X

Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: అనంతపురం జిల్లాలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. బుక్కరాయసముద్రం మండలం దయ్యకుంటపల్లి వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. అనంతపురం నుంచి నార్పలకు వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను అనంతపురానికి చెందిన వారిగా గుర్తించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story