AP Floods: ఏపీలో వరద బీభత్సానికి పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయింది

AP Floods: 5లక్షల ఎకరాలల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2024 3:06 PM IST
Farmers have lost a lot due to floods in AP
X

AP Floods: ఏపీలో వరద బీభత్సానికి పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయింది

AP Floods: ఏపీలో భారీ వర్షాలు, వరదలకు పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయిందని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 5లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసిందని... ఇంకా లెక్కల్లోని రాని పంటపొలాలు చాలానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో వరద బీభత్సానికి జరిగిన నష్టంపై అంచనా వేయడానికి రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సభ్యులతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు కలిసి వినతి పత్రం అందించారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలను తాజా వరదలు మరింత నష్టాల్లోకి నెట్టేశాయన్నారు. నష్టాన్ని బట్టి.. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిహారం చెల్లించాలని కోరుతున్న రైతు సంఘం నేతలు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story