మీడియాపై దాడి చేసే మనస్తత్వం రైతులది కాదు.. వారే మీడియాపై దాడి చేశారు: ఎంపీ సురేష్

మీడియాపై దాడి చేసే మనస్తత్వం రైతులది కాదు.. వారే మీడియాపై దాడి చేశారు: ఎంపీ సురేష్
x
నందిగామ సురేష్
Highlights

రాజధాని అమరావతి ప్రాంతంలో మీడియాపై జరిగిన దాడిని ఎంపీ నందిగామ సురేష్ ఖండించారు. రైతుల రూపంలో టీడీపీ కార్యకర్తలు మీడియాపై దాడి చేశారని ఆరోపించారు....

రాజధాని అమరావతి ప్రాంతంలో మీడియాపై జరిగిన దాడిని ఎంపీ నందిగామ సురేష్ ఖండించారు. రైతుల రూపంలో టీడీపీ కార్యకర్తలు మీడియాపై దాడి చేశారని ఆరోపించారు. మీడియాపై దాడి చేసే మనస్తత్వం రైతులకు వుండదని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం అన్నారు. సచివాలయం తరలివెళ్లిపోయినంతామాత్రన అభివృద్ధి ఆగిపోతుంది అనుకుంటే పోరపాటే అని నందిగామ సురేష్ చెప్పారు.

రాజధాని అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల ఆందోళనను కవరేజ్ చేస్తున్న మీడియాపై కొందరు దాడి చేశారు. లేడి రిపోర్టర్‌తో పాటు మరోకరు ఈ ఘటనలో గాయపడ్డారు. అయితే తాము ఎవరిపై దాడి చేయలేదంటూ స్ధానిక రైతులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories