ఆంగ్ల బోధనలో నైపుణ్యం అవసరం

ఆంగ్ల బోధనలో ఉపాధ్యాయులు నైపుణ్యం చాటాలని ఆత్మకూరు ఎండిఓ నజీర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా బోధన నైపుణ్య శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

S. Srikanth
Published on: 12 Feb 2020 3:34 PM IST
ఆంగ్ల బోధనలో నైపుణ్యం అవసరం
X

ఆంగ్ల బోధనలో ఉపాధ్యాయులు నైపుణ్యం చాటాలని ఆత్మకూరు ఎండిఓ నజీర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా బోధన నైపుణ్య శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆంగ్ల భాష విశ్వవ్యాప్తంగా వాడుకలో ఉన్నందున విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు.

డిఆర్పిలు రవీంద్ర కుమార్,శివ కుమార్, ఇమామ్ భాష, రామిరెడ్డి తదితరులు ఆంగ్ల మాధ్యమంలో పలు విషయాలపై అవగాహన కల్పించారు. అకడమిక్ కోర్స్ డైరెక్టర్ శ్రీనివాసులు జిల్లా పరిశీలకుడు పట్నం అనిల్ కుమార్ ఆర్ సి ఆర్ పి రసూల్ తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story