Mandapeta: హామీలు నెరవేరుస్తాం: డిప్యూటీ సీఎం

Mandapeta: హామీలు నెరవేరుస్తాం: డిప్యూటీ సీఎం
x
Highlights

ప్రజా సంక్షేమ ప్రభుత్వం తమదని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ పేర్కొన్నారు. జిల్లా లోని మండపేట మండలం ఏడిద సీతానగరం లో శనివారం రాత్రి సన్న బియ్యం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

మండపేట: ప్రజా సంక్షేమ ప్రభుత్వం తమదని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ పేర్కొన్నారు. జిల్లా లోని మండపేట మండలం ఏడిద సీతానగరం లో శనివారం రాత్రి సన్న బియ్యం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రవ్యా ప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు కార్డుల్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు బిల్లులు, ఇతర సమస్యల కారణంగా అనర్హత పొందిన 8 లక్షల కుటుంబాలకు చెందిన కార్డులను పునః పరిశీలిస్తున్నామని వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే 7.5 లక్షల కుటుంబాలను అనర్హులుగా గుర్తించా మని చెప్పారు. 1.5 లక్షల కార్డులకు సంబంధించి చిరునామా అందుబాటులో లేకపోవడంతో రెండోసారి సామాజిక తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసిన అయిదు రోజుల్లో కొత్త కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా కార్డుల పంపిణీ జరుగుతుందని వివరించారు. దీనికి ఎవరికీ సొమ్ము ఇవ్వాల్సిన పనిలేదన్నారు.

ఈ కార్డులపై క్యూఆర్‌ కోడ్‌, సహా య కేంద్రం ఫోన్‌ నంబరు, కుటుంబ యజమాని ఫొటోతోపాటు తెలుగు, ఆంగ్లంలో వివరాలు ముద్రించారన్నారు.తమ ప్రభుత్వం ఉచిత గాలి హామీలు ఇవ్వదన్నారు.చెప్పిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి ప్రతి హామీ నెరవేరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసాదరావు, తహసీల్దార్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories