పులివెందుల ప్రజలకు వినోదం భారమే

పులివెందుల ప్రజలకు వినోదం భారమే
x
ప్రతీకారాత్మక చిత్రం
Highlights

ప్రజలకు వినోదం ప్రస్తుత పరిస్థితులలో భారం గా కనిపిస్తుంది కానీ కార్పొరేట్ పేరుతో జనాలను దోచుకోవడం జరుగుతుందని సగటు ప్రేక్షకులు వాపోతున్నారు.

పులివెందుల: ప్రజలకు వినోదం ప్రస్తుత పరిస్థితులలో భారం గా కనిపిస్తుంది కానీ కార్పొరేట్ పేరుతో జనాలను దోచుకోవడం జరుగుతుందని సగటు ప్రేక్షకులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఒక కుటుంబం మాత్రం సినిమా థియేటర్ కి వెళ్లాలంటే అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుందని అదేవిధంగా మిగతా థియేటర్లకు పోల్చుకుంటే రెండు రెట్లు అధికమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా హాల్ ను రీ మోడలింగ్ చేశారు.

ఇందుకు యాజమాన్యానికి అభినందిస్తున్నాము. కానీ రీమోడలింగ్ నెపంతో ప్రజల జేబులకు చిల్లులు పడే విధంగా మారుతి థియేటర్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. రీ మోడలింగ్ చేసిన తర్వాత మన సైరా ఈరోజు సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు ఒక టికెట్ ధర 300 నుంచి 200 వందల రూపాయలు గా ఆన్లైన్ విక్రయిస్తున్నారు. సరే కదా కొత్త హాల్లో కదా అని కొన్ని సినిమా కి వెళ్తే అక్కడ సినిమా మధ్య మధ్యలో ఏసీని ఆఫ్ చేస్తున్నారు. దీనివలన చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇంటర్వెల్ లో కూడా హైదరాబాద్ సిటీ ఐమాక్స్ లో కూడా అధిక ధరలతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories