Kotapadu: ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి

పోలింగ్‌ సిబ్బంది పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని స్థానిక ఎంపీడీఓ కె.శచీదేవి తెలిపారు.

S. Srikanth
Updated on: 14 March 2020 4:49 PM IST
Kotapadu: ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి
X

కోటపాడు:పోలింగ్‌ సిబ్బంది పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని స్థానిక ఎంపీడీఓ కె.శచీదేవి తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో శనివారం పీఓ, ఏపీఓల ఎన్నికల శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ స్టేషన్లకు సామగ్రి తరలింపు, ఎన్నికల నిర్వహణ తదితర విషయాలపై ఆమె అవగాహన కల్పించారు.

ఎన్నికల సిబ్బంది ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పీఓలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందితే సజావుగా ఎన్నికల ప్రక్రియ సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు వినియోగిస్తున్ననందున అప్రమత్తంగా ఉండాలన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story