AP Election 2024: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. సీఎస్‌, డీజీపీకి సమన్లు

AP Election 2024: ఏపీలో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Published on: 15 May 2024 3:39 PM IST
Election Commission Summons AP CS and DGP
X

AP Election 2024: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. సీఎస్‌, డీజీపీకి సమన్లు

AP Election 2024: ఏపీలో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనలపై ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఈసీ సమన్లు జారీ చేసింది. రేపు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై ఈసీ సీరియస్‌గా ఉన్నట్లు సమచారం. ఈసీ ఆదేశాలతో సీఎస్‌, డీజీపీ గురువారం దిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story