Srikakulam: మత్స్యకారుల వలకు చిక్కిన డ్రోన్ జెట్..!

శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద డ్రోన్ జెట్ కలకలం

Arun Chilukuri
Published on: 2 Feb 2023 12:19 PM IST
Drone Jet Found Bavanapadu Beach Srikakulam
X

Srikakulam: మత్స్యకారుల వలకు చిక్కిన డ్రోన్ జెట్..!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరానికి డ్రోన్‌ జెట్ కొట్టుకొచ్చింది. మూలపేట, భావనపాడు మధ్య చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు సముద్రంలో తేలియాడుతూ డ్రోన్ కనిపించింది. దీనిని గుర్తించిన మత్స్యకారులు... బోటులో భావనపాడు తీరానికి చేర్చారు. వెంటనే మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని డ్రోన్‌ జెట్‌ను పరిశీలించారు. దీన్ని ఎవరు ప్రయోగించారు? ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలను ఆరా తీస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story