డాక్టర్ చంద్రహాసన్ రెడ్డికి అంబేద్కర్ సేవా పురస్కారం

డాక్టర్ చంద్రహాసన్ రెడ్డికి అంబేద్కర్ సేవా పురస్కారం
x
డాక్టర్ చంద్రహాసన్ రెడ్డి, నెల్లూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ చైత్ర వర్షిని, సుబ్బా రెడ్డి
Highlights

మండల పరిధిలోని తొట్టి గారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రహాసన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా పురస్కారం పొందినట్లు పేర్కొన్నారు.

బద్వేల్: మండల పరిధిలోని తొట్టి గారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రహాసన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా పురస్కారం పొందినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలోని చింత రామ్మూర్తి ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానవహక్కుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ చైత్ర వర్షిని, మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ సుబ్బా రెడ్డి చేతుల మీదుగా అవార్డు స్వీకరించడం సంతోషకరంగా ఉందని అన్నారు.

మండల వైద్యాధికారిగా మాతా, శిశు మరణాలు అరికట్టడంలో, పల్స్ పోలియో లాంటి జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం లోనూ, సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు మారుమూల గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వ్యాధులను అరికట్టి ప్రజలలో ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించుటలో, సామాజిక సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం సౌత్ ఇండియా చైర్మన్ కోనయ్య, సౌత్ ఇండియా డైరెక్టర్ సురేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఆవుల కిషోర్, రాష్ట్ర డైరెక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories