
ప్రధానమంత్రి నరేద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను అందరు ఈ ఆదివారం తప్పక పాటించాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు విజ్ఞప్తి చేశారు.
వెంకటాచలం: ప్రధానమంత్రి నరేద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను అందరు ఈ ఆదివారం తప్పక పాటించాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి ఎవరికి వారే ఉదయం 7 గం. నుంచి రా. 9 గం. ఇంటివద్దే వుండాలని విశ్వవిద్యాలయ శ్రేణులను విద్యార్థులను అలాగే జిల్లా ప్రజలను కోరారు. కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది.
ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇతర దేశాలైన ఇటలీ, ఇరాన్ తగిన ముందస్తు పటిష్టమైన చర్యలు చేపట్టక పోవటం వలన అక్కడ అపార ప్రాణ నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విషయములో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కట్టుదిట్ట చర్యలు చేపట్టాయని అందుకు వారిని మనమందరం మనస్ఫూర్తిగా అభినందించాలని అన్నారు. అలాగే వారి పిలుపు మేరకు ఈ వైరస్ ని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ ను పాటించి ఒక్కరోజు ఇళ్ళకే పరిమితమయ్యి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిర్మూలించటానికి సహకరిద్దామని అన్నారు.
ఈ కరోనా వైరస్‌ని నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తోన్న వైద్యులు, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులు, పోలీస్ శాఖ వారికి అలాగే వారికి సరిగ్గా సాయంత్రం 5 గంటలకి మన ఇంటి గుమ్మాలలోకి వచ్చి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుదాం. ఈ సమావేశంలో ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




