
ఇటలీ నుండి వచ్చిన నెల్లూరు వాసికి ప్రాథమిక పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నెల్లూరులో అధికారులు అప్రమత్తమయ్యారు.నెల్లూరు చిన్నబజార్ కు చెందిన ఓ విద్యార్ధి ఈనెల 6వ తేదీనా ఇటలీ నుండి నెల్లూరుకు వచ్చాడు.
నెల్లూరు: ఇటలీ నుండి వచ్చిన నెల్లూరు వాసికి ప్రాథమిక పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నెల్లూరులో అధికారులు అప్రమత్తమయ్యారు.నెల్లూరు చిన్నబజార్ కు చెందిన ఓ విద్యార్ధి ఈనెల 6వ తేదీనా ఇటలీ నుండి నెల్లూరుకు వచ్చాడు.అతనికి కరోనా లక్షణాలు ఉండటంతో నెల్లూరులోని ప్రభుత్వప్రధాన వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అతని నుండి సేకరించిన శాంపిల్స్ ను తిరుపతిలోని స్విమ్స్ కు పంపగా ప్రాథమికంగా కరోనా వైరస్ఉన్నట్లు తేల్చారు. దీంతో పూర్తి స్థాయి పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ను పూణే ల్యాబ్ కు పంపారు. రిపోర్టు రావల్సి ఉంది. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. అతనితో పాటూ వారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వారు నివాసం ఉండే చిన్నబజార్ దాని పరిసరప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఆరోగ్య వాలంటీర్లు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి విదేశాల నుండి ఎవరైనా వచ్చారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరిచారు.మరో వైపు దీనిపై నెల్లూరు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్. రాజ్యలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరోనా వ్యక్తికిసంభందించి ల్యాబ్ రిపోర్టు పూణే నుండి రావల్సి ఉందన్నారు. అతను ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిచేదని,తరచూ చేతులను శుభ్రం చేసుకుంటే ఇలాంటి వైరస్ లు శరీరంలోకి ప్రవేశించవని వివరించారు.
28 రోజుల తర్వాత వైరస్ శరీరంలో ఉండే అవకాశం లేదన్నారు. అలాగే ఈ నెల 10వ తేదీనా పోర్చుగల్ నుండి 30 మంది ఓ సెమినార్ లో పాల్గొనేందుకునెల్లూరుకు వచ్చి హోటల్ మినర్వాలో బస చేశారని వారి వివరాలు కూడా సేకరించామన్నారు. వారికి కరోనా వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వారిని హోటల్ లోనే ఉంచి పరీక్షలు జరుపుతున్నామని తెలియజేశారు. కరోనాపై ఎవ్వరూ ఆందోళన చెందవద్దనిస్పష్టం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



