అడ్డరోడ్ మార్కెట్ ని పరిశీలించిన ఏఎస్పీ
ఎస్.రాయవరం: అడ్డరోడ్ లోని పాత జాతీయ రహదారి పక్కన ఉన్న చేపలు, కూరగాయలు, పళ్ళ దుకాణాల సముదాయాన్ని నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. దుకాణాలకు విచ్చేసే వినియోగదారులు భౌతిక దూరం పాటిస్తున్నారా లేదో పరిశీలించారు.
ఇక్కడి వ్యాపారులంతా తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా తిరిగే వాహనదారులపై చర్యలు తీసుకుని , వాహనాలను సీజ్ చేయాలని , ప్రజలు అనవసరంగా బయటకి రాకుండా ఉండేందుకు నిరంతరం గస్తీ తిరగాలని ఎస్ ఐ ధనుంజయకి సూచించారు.
Next Story




