Kadapa: మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
నగరంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి శైలజ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
District Education Officer Sailaja visited several schools
కడప: నగరంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి శైలజ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. జయనగర్ కాలనీ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు పాఠశాల దస్త్రాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. రుచికరమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్, చేతుల శుభ్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Next Story


