క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ నివాస్

క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్  నివాస్
x
Highlights

సంతబొమ్మాలి: మండల కేంద్రం సంతబొమ్మాలిలోని కేజీ బివి లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ నివాస్ ఆకస్మికంగా సందర్శించి...

సంతబొమ్మాలి: మండల కేంద్రం సంతబొమ్మాలిలోని కేజీ బివి లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ నివాస్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ కేంద్రం లో కల్పించినసదుపాయాలు, శానిటేషన్ ఎలా ఉన్నాయో అనే విషయం పై జిల్లా కలెక్టర్ నివాస్ ఈ సందర్భంగా పరిశీలించారు. అలాగే మహిళలకు చీరలు, మగవాళ్ళు కి తువ్వాలు, లుంగీపంచెలు, అవసరం అయిన మేరకు అందజేయాలని మండల తహసీల్దార్ పి సోమేశ్వర రావు కు ఆదేశించారు.

అలాగే ఏ ఒక్కరూ ఈ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. అలాగే ఈ కేంద్రాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి రెవెన్యూ అధికారి ఈట్ల కిషోర్. సంతబొమ్మాళి ఎంపీడీఓ హనుమంతు శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories