RGV: విచారణకు రామ్ గోపాల్ వర్మ డుమ్మా

Dhivi
Published on: 11 Feb 2025 8:47 AM IST
Director Ram Gopal Varm Skips AP CID Inquiry
X

RGV: విచారణకు రామ్ గోపాల్ వర్మ డుమ్మా

RGV: ఏపీ సీఐడీ విచారణకు దర్శకుడు ఆర్జీవీ డుమ్మా కొట్టారు. సోమవారం ఆయన గుంటూరు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే 8 వారాల గడువు కావాలని ఆయన తరపు న్యాయవాది సీఐడీ అధికారులను కోరారు. ఆర్జీవీ 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా పేరుపై తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్ వేయడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో విడుదల చేశారు.

అయితే యూట్యూబ్ లో మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో విడుదల చేశారంటూ సీఐడీ పోలీసులు మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీక్రిష్ణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మపై మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్ 29నకేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను ఆర్జీవీకి ఇటీవల ఒంగోలులో సీఐడీ అధికారులు అందజేశారు. ఈ కేసులో విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉండగా గడువు కోరారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్మకు నోటీసులు అందజేయాలని సీఐడీ అధికారులు యోచిస్తున్నారు.

Dhivi

Dhivi

Next Story