Tirumala: తిరుమలలో గుండెపోటుతో భక్తురాలి మృతి

Tirumala: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గుండెపోటుతో ఓ భక్తురాలు మృతి చెందింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Sept 2024 9:32 AM IST
Devotee From Kadapa Dies of Heart Attack in Tirumala
X

Tirumala: తిరుమలలో గుండెపోటుతో భక్తురాలి మృతి

Tirumala: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గుండెపోటుతో ఓ భక్తురాలు మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున వైకుంఠ క్యూ క్లాంపెక్స్ లో క్యూలైన్ లో వెళ్తుండగా ఝాన్సీ అనే భక్తురాలు ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే భక్తులు, సిబ్బంది అప్రమత్తమై సీపీఆర్ చేసి రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు.

మృతురాలిని లండన్‌లో స్థిరపడిన కడప జిల్లా వాసి ఝాన్సీ(32)గా గుర్తించారు. ఆమెకు కవల పిల్లలున్నారు. ఝాన్సీ మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లో డాక్టర్‌తో కూడిన అత్యవసర వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నతాధికారులున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story