విశాఖ వాసులను భయపెడుతున్న డెవిల్ ట్రీ

విశాఖ వాసులను భయపెడుతున్న డెవిల్ ట్రీ
x
Highlights

సాగర తీరం విశాఖ నగరంలో అదో పచ్చటి చెట్టు ఏడాది పొడవునా కొమ్మలు రెమ్మెలతో కళలాడుతుంది. సీజన్లో తెల్లటి పువ్వులతో ఆకర్షిస్తుంది. ఇప్పుడు అదే చెట్టు...

సాగర తీరం విశాఖ నగరంలో అదో పచ్చటి చెట్టు ఏడాది పొడవునా కొమ్మలు రెమ్మెలతో కళలాడుతుంది. సీజన్లో తెల్లటి పువ్వులతో ఆకర్షిస్తుంది. ఇప్పుడు అదే చెట్టు వైజాగ్ వాసులను వణికిస్తుంది. అంతగా భయపెడుతున్న డెవిల్ ట్రీ కథ ఎంటో తెలుసుకోవాలనుకుంటే విశాఖ వెళ్లాల్సిందే.

పచ్చని మెక్కలు, పూల వనాలు విశాఖ కు గ్రీన్ సీటీ గా పేరు తెచ్చాయి. హుద్ హుద్ తరువాత వన సంపద ను కోల్పోయిన విశాఖను పునరుద్దరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రీన్ ప్రాజెక్ట్ చేపట్టింది. నగరంలో పలు కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏడాకులపాల చెట్లు నాటింది అప్పటి ప్రభుత్వం. ఆల్ స్టోనీయా స్కోలరీస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ రకం మొక్క అతి తక్కువ సమయంలో ఏపుగా పెరుగుతుంది. త్వరితగతిన పచ్చదనం నింపేందుకు సిటీ అంతటా దాదాపుగా 5 లక్షల కు పైగా మొక్కలను నాటారు. అవి కాస్తా ఏపుగా పెరిగి పూత దశకు చేరుకున్నాయి. అంతా బాగానే వుంది అనుకున్నారు. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. దుర్గంద పూరితమైన పూలు చెట్ల సమీపంలో ఉంటే వికారం తలనొప్పి శ్వాససంబంధమైన వ్యాదులు ప్రబలతున్నాయి.

ఆంధ్రా యూనివర్సిటీ బోటనీ పరిశోదకులు ఈ చెట్ల నుంచి వచ్చే దుష్ప్రభావాలపై పరిశోదనలుచేస్తున్నారు. శీతాకాలంలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. అక్టోబర్ నుండి జనవరి మధ్యలో మాత్రం ప్రూనింగ్ చేస్తే ఈ మొక్క వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని సూచిస్తున్నారు. ఢిల్లీ, నొయిడాల్లో ఇప్పటికే ఈ చెట్లు నాటడం ఉద్యాన వన శాఖ విభాగం నిషేధించింది.

ఆరోగ్యానికి హానికరమైన ఏడాకుల పాల చెట్లను తొలగించాలని పోల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పిర్యాదులు అందుతున్నాయి. ప్రజాసమస్యను గుర్తించి అటవీశాఖ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశామని, వీటిపై నిపుణులతో పరిశీలన చేయించడం తో పాటు ప్రత్యమ్నాయాలను వెతకాలని పోల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఏడాకుల పాల చెట్లను తగ్గించే పనిలో పడ్డారు జీవీఎంసీ అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories