AP News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుగాలీ ప్రీతి తల్లి పార్వతి

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తన కుమార్తె కేసు పురోగతిపై ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2024 11:00 AM IST
Deputy Chief Minister Pawan Kalyan met family members of Sugali Preethi
X

AP News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుగాలీ ప్రీతి తల్లి పార్వతి

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తన కుమార్తె కేసు పురోగతిపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని... అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదని సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమైయ్యారు. మంగళగిరిలో తన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని పవన్ కల్యాణ్‌ను కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారని అన్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story