Visakhapatnam: కరోనా నివారణకు విశాఖపోర్ట్లో కఠినమైన చర్యలు
పోర్ట్‌లో కరోనా నివారణకు చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు పోర్ట్ యాజమాన్యం వెల్లడించింది.
Deputy Chairman PL. Haranath about Coronavirus
విశాఖపట్నం:పోర్ట్‌లో కరోనా నివారణకు చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు పోర్ట్ యాజమాన్యం వెల్లడించింది. కరోనా బాధిత దేశాల నుంచి వాణిజ్య నౌకలు నేరుగా పోర్ట్‌లోకి రాకుండా ఔటర్ హార్బర్‌లోనే పూర్తిగా తనిఖీ చేస్తున్నామన్నారు.సిబ్బందిని 14 రోజుల స్వీయ నిర్బంధ విధానం అనుసరించిన తర్వాతనే వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం సరకు దిగుమతికి ఇన్నర్ పోర్ట్‌లోకి అనుమతిస్తామని విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్మన్ పి.ఎల్. హారనాధ్ వెల్లడించారు. జాతీయ మార్గదర్శకాలను పాటించిన తర్వాతనే కార్గో ఆన్ లోడింగ్‌కి అనుమతి లభిస్తుందని ఆయన వివరించారు.
Next Story


