ఏపీకి పొంచి వున్న భారీ వర్షాల ముప్పు

K V D Varma
Updated on: 2 Aug 2019 12:47 PM IST
ఏపీకి పొంచి వున్న భారీ వర్షాల ముప్పు
X

ఇప్పటికే వారం రోజులుగా వర్షంలో తడిసి ముద్దవుతున్న ఏపీకి రానున్న రోజుల్లో మారిన్ని వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంలాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి రుతుపవనాలు తోడవడంతో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురవడంతో పాటు వాతావరణం ముసురు పట్టి ఉంది.

కాగా, థాయిలాండ్ పరిసరాల్లో ఏర్పడ్డ అల్పపీడనం ఆగస్టు 4 వతేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ కేంద్ర డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాతావరణం రుతుపవనాలకు అనుకూకంగా ఉందని అయన తెలిపారు. దీని కారణంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇక రేపు ఏపీ లోని కోస్తా ప్రాంతం, యానాం లలో కొన్ని చోట్ల , రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖా చెప్పింది. అదేవిధంగా ఆగస్టు 5 నుంచి 8 వరకూ ఏపీ, ఒడిశా లలో భారీ వర్షాలు కురుస్తాయానీ, తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.



K V D Varma

K V D Varma

Next Story