వైద్య సిబ్బంది నియమించే వరకు మా నిరాహారదీక్ష ఆగదు : దాసరి రెడ్డి

వైద్య సిబ్బంది నియమించే వరకు మా నిరాహారదీక్ష ఆగదు : దాసరి రెడ్డి
x
Highlights

స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని పెద్దిరెడ్డి దాసరిరెడ్డి (ప్రజా చైతన్య వేదిక ),పానుగంటి సతీష్ (విముక్త చిరుతల కక్షి), శ్రీనివాసులు (బహుజన సమాజ్ పార్టీ )దండు అనిల్ కుమార్ ఎం.సి.డి.కె.పి.ఎస్. నాయకులు,బహుజనుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షను ప్రారంభిచారు.

కంభం : స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని పెద్దిరెడ్డి దాసరిరెడ్డి (ప్రజా చైతన్య వేదిక ),పానుగంటి సతీష్ (విముక్త చిరుతల కక్షి), శ్రీనివాసులు (బహుజన సమాజ్ పార్టీ )దండు అనిల్ కుమార్ ఎం.సి.డి.కె.పి.ఎస్. నాయకులు,బహుజనుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షను ప్రారంభిచారు.

ఎంసీడీకెపిఎస్. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డెపోగు పెద్దగురవయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి షాలెంరాజు ప్రారంభించిన నిరాహారదీక్ష ను,కందులాపురం సెంటర్ నందు ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం రెండవ రోజు దాసరి రెడ్డి మాట్లాడుతూ వైద్య సిబ్బందిని నియమించే వరకు మా నిరాహారదీక్ష ఆగదని తెలిపారు.

శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు పనిచేసిది ప్రజల సంక్షేమము కోసం కాదా ,ఎందుకు ఇంత నిర్లక్షమని ,సిబ్బంది లేక ఇబ్బంది పడుతుంటే మౌనంగా ఎందుకు అన్నారు. దాసరి యోబు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి లో సరైన వైద్య సదుపాయం లేక చావాల్సిందేనా అన్నారు. 20 రోజుల నుండి ప్రజలు వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని,ఇప్పటికైనా 24 గంటల సేవలు తక్షనమే అమలు చేయాలని , జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకుంటె ఇక ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో , బహుజనుల ఐక్యవేదిక నాయకులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories