చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న ఆర్టీసీ అధికారులు..ప్రజలకు తప్పని పాట్లు!

చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న ఆర్టీసీ అధికారులు..ప్రజలకు తప్పని పాట్లు!
x
Highlights

సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రజలు సరైన రవాణా సౌకర్యం లేక అవస్థలు...

సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రజలు సరైన రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. అటు అంతరాష‌్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభంకావాలంటే ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల మధ‌్య ఒప్పందం జరగాలి. దీంతో దసరా పండుగకైనా బస్సులు నడుస్తాయో లేదో అనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రజల సమస్యలను పట్టించుకోని ఆర్టీసీ అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. నాలుగు సార్లు సమావేశమైన అధికారులు అంతరాష్ట్ర బస్సు రవాణా ఒప్పందాలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పండుగలు సమీపిస్తున్న వేళ జనాలు ఊళ్లకు వెలతారని తద్వారా ఆర్టీసీ రెవెన్యూ పెంచుకుందామనే ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇక చర్చల్లో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీ తీసుకొచ్చిన ప్రతిపాదనను తెలంగాణ ఆర్టీసీ అంగీకరించకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది.

లాక్‌డౌన్‌కు ముందు ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 2లక్షల 65కిలోమీటర్ల మేర బస్సులు నడిపేది. ఇటు తెలంగాణ కూడా ఏపీలో లక్షా 55వేల కిలోమీటర్లు నడిపింది. అయితే ఇప్పుడు వీటి మధ‌్య వ్యత్యాసం లక్షా 10వేల కిలోమీటర్లు. అయితే ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్ల మేర బస్సులు నడిపిస్తోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు కిలోమీటర్లు తగ్గించుకోవాలని ఏపీ అధికారులకు ప్రతిపాదన పెట్టింది. అయితే ఉన్నపలంగా లక్షల కిలోమీటర్ల మేర రవాణా తగ్గించుకుంటే తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సులు కొనుక్కోవాల్సి వస్తుందని ఏపీఆర్టీసీ అధికారుల అభిప్రాయం. అయితే బస్సులు కొనుగోలు చేసేవరకు ఏపీఎస్‌ ఆర్టీసీ రవాణా చేస్తామంటే దానికి తెలంగాణ ఆర్టీసీ ససేమిరా అంటుంది. ఇక వీరి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో అటు ప్రైవేట్‌ రవాణా సంస్థలు లాభపడుతున్నాయి. అటు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ మధ‌్య చర్చలు త్వరగా పూర్తి కావాలని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌ రెండు ప్రభుత్వాలను కోరారు. అదేవిధంగా ప్రజలు బస్సు రవాణా గురించి ఎదురుచూస్తున్నారన్నారు. పండుగలా సమయాల్లో ఇరు రాష్ట్రాలు బస్సులు నడుపుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories