Nellore: అనుభూతిని కలిగించేవి కళలు: ఏఎస్పీ

Nellore: అనుభూతిని కలిగించేవి కళలు: ఏఎస్పీ
x
Highlights

మనిషికి కళలు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, అనుభూతిని కలిగిస్తాయని జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.వి రత్నం పేర్కొన్నారు.

నెల్లూరు: మనిషికి కళలు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, అనుభూతిని కలిగిస్తాయని జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.వి రత్నం పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం, నెల్లూరు పెరేడ్ గ్రౌండ్స్ లోని ఉమేష్ చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలునందు జిల్లాస్థాయి ఆర్ట్ అండ్ కల్చరల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత జ్యోతీ ప్రజ్వలన చేసిన ఆమె మాట్లాడుతూ... మందులతో నయంకాని ఎన్నోరకాల జబ్బులు కూడా సంగీతంతో నయం కాగలవని, అందువల్ల విద్యార్థులు ముఖ్యంగా యువత కళలపట్ల ఆసక్తిని పెంపొందించుకొని అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు.

నింగి నవ్వితే జలం, నేల నవ్వితే ఫలం, నీరు నవ్వితే జీవం, గాలి నవ్వితే పరిమళం, నిప్పు నవ్వితే వెలుగు... కానీ మనిషి మాత్రం కల్మషం, కాలుష్యం వీటన్నింటినీ ప్రక్షాళన చేసి సాటి మనిషికి సంతోషాన్ని సంతృప్తిని పంచేది కళలు. ప్రతి ఒక్కరూ సంగీతాన్ని అభిమానించాలి, ఆరాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్ ఆకుల మహేందర్రెడ్డి, డాక్టర్ లహరి, మోటివేటర్ కరిమద్దెల నరసింహారెడ్డి, అందె శ్రీనివాసులు, మురళీమోహన్ రాజు, షేక్ రియాజ్ భాషా, ఎస్.వి రమేష్ బాబు, టి. వెంకటేశ్వర్లు, అల్లం ఉదయ్ శంకర్, షేక్ కాలేషా, డాక్టర్ ఎంబేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొని జిల్లాలోని కళాకారులను మొమెంటోలతో సత్కరించారు. అనంతరం ఆదర్శ మహిళ, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ఎం. సంధ్యను జిల్లాలో వ్యవసాయ రంగానికి ఆమె చేసిన కృషికిగాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories