Kadapa: మార్చి 7న జరిగే బహిరంగసభ కు తరలిరావాలి: సీపీఐ

జిల్లా వేదికగా మార్చి 7వ తేదీన ఎన్ఆర్సీ, సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు.

S. Srikanth
Published on: 29 Feb 2020 4:15 PM IST
Kadapa: మార్చి 7న జరిగే బహిరంగసభ కు తరలిరావాలి: సీపీఐ
X

కడప: జిల్లా వేదికగా మార్చి 7వ తేదీన ఎన్ఆర్సీ, సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, ప్రజా, మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిల్లుపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రజల గొంతుకను వినిపించేందుకే బహిరంగ సభ ఏర్పాటు చేశామని అన్నారు.

బహిరంగ సభకు సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి. రాజా, రాష్ట్ర కార్యదర్శులు హాజరవుతున్నారని అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని,ఇంటికో మనిషి.. ఊరికో బండి అన్న నినాదంతో బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.


S. Srikanth

S. Srikanth

Next Story