ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సీపీఐ నాయకులు 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

S. Srikanth
Published on: 26 Dec 2019 3:07 PM IST
ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం
X

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సీపీఐ నాయకులు 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య పాల్గొని జెండాను ఎగరవేసి, కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ, వామపక్ష పార్టీ నిరంతరం ప్రజల కోసం శ్రమించి, ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని, వారి కోసం నిరంతరం పోరాడే పార్టీ అన్ని తెలియజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటికి 95 సంవత్సరాలు అవుతున్నా నిత్యం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటుందన్నారు . ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story