Coronavirus: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

Raj
By Raj
Published on: 14 Jun 2020 3:40 PM IST
Coronavirus: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
X

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకూ మొత్తం 15,633 శాంపిల్స్ ను పరీక్షించగా. కొత్తగా మరో 253 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4841కి చేరింది.

అలాగే గత 24 గంటల్లో 82మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2723 డిశ్చార్జ్ కాగా తూర్పుగోదావరిలో ఒకరు, కర్నూలులో మరొకరు మృతి చెందడంతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 84కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2034 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు.

Raj

Raj

Next Story