Coronavirus Updates in AP: 24 గంటల్లో 7,882 కొత్త కేసులు.. 63 మంది మృతి

Coronavirus Updates in AP: ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా

Krishna
Updated on: 3 Aug 2020 8:33 PM IST
Coronavirus Updates in AP: 24 గంటల్లో 7,882 కొత్త కేసులు.. 63 మంది మృతి
X
Coronavirus Updates in india

Coronavirus Updates in AP: ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 7,882 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,66,586 కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 63 మంది చనిపోయారు. దీనితో తాజా కేసులతో కలిపి మరణాల సంఖ్య 1537 కి చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 76,337 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు కరోనాతో పోరాడి 88,672 మంది డిశ్చార్జ్ అయ్యారు.

24 గంటల్లో నమోదైన కేసులలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,113 కేసులు, విశాఖపట్నం జిల్లా నుంచి 1,049 కేసులు వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది, విశాఖపట్నం జిల్లాలో 9 , ప్రకాశం జిల్లాలో 8, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 7, విజయనగరం 4, చిత్తూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 3, అనంతపురం,తూర్పు గోదావరి,గుంటూరు, కడప జిల్లాల్లో 2 చనిపోయారు.

Krishna

Krishna

Next Story