Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 52 మంది మృతి..

Arun Chilukuri
Published on: 25 July 2020 6:04 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 52 మంది మృతి..
X
Corona rep image

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 7,813 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 53,681 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,813 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 3,208 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా వల్ల గుంటూరులో 9, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరి 6, కృష్ణాలో 6, కర్నూలులో 6, చిత్తూరు 5, విజయనగరం 4, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 3, నెల్లూరు 1, ప్రకాశంలో ఒకరు ఒకరు మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 85,776. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 985. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 40,406 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 44,385 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 53,681 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 15,95,674 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story