Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు!

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 5,210 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 11 Oct 2020 6:08 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు!
X

Coronavirus 

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 5,210 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 7,55,727కి చేరుకుంది. ఇందులో 46, 295 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 7,03,208మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 6,224కి చేరుకుంది. ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 75,517కరోనా టెస్టులు నిర్వహించారు..

ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు 4, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున మృతి చెందగా, అనంతపురం, కృష్ణాలో ఇద్దరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. ఇక జిల్లాల వారిగా కరోనా వైరస్ కేసులు చూసుకుంటే అనంతపుర్ జిల్లాలో 165, చిత్తూరులో 412, ఈస్ట్ గోదావరి లో 208, గుంటూరులో 348, కడపలో 174, కృష్ణలో 388, కర్నూలు 124, నెల్లూరులో 219, ప్రకాశం 230, శ్రీకాకుళంలో 165, విశాఖపట్నంలో 96, విజయనగరంలో 90, వెస్ట్ గోదావరి లో 327 కేసులు నమోదయ్యాయి.


Krishna

Krishna

Next Story