Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

Arun Chilukuri
Updated on: 27 Aug 2020 5:58 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,621 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,300 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,621 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,528 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో 13 మంది, నెల్లూరు 11, తూర్పుగోదావరి 10, చిత్తూరు 9, కడప 7, పశ్చిమగోదావరి 7, అనంతపురం 6, ప్రకాశం 6, విశాఖపట్నం 6, గుంటూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,90,195. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,633. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,92,353కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 94,209 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,300 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 34,79,990 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story