టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట

Arun Chilukuri
Published on: 25 Aug 2020 4:57 PM IST
టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట
X

Andhra Pradesh police department won 10 Awards: టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో పది అవార్డులను సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. ఈ సంవత్సరం ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకున్న ఎపి పోలీస్ శాఖ, తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. టెక్నికల్ విభాగం లో 7 అవార్డులు, అనంతపురం జిల్లాకు 2, సీఐడీ 4S 4U విభాగానికి 1 అవార్డు దక్కాయి.

ఏడాది వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 36 అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. టెక్నాలజీ వినియోగం లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు ఎపి పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వెబినార్ ద్వార అవార్డులను అందుకున్నారు డీజీపీ. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ హరీష్ కుమార్ గుప్త, ఐ.జి పర్సనల్ మహేష్ చంద్ర లడ్డా, ఐ. జి. పి అండ్ ఎల్ నాగేంద్ర కుమార్, టెక్నికల్ డి.ఐ.జీ పాలరాజు, డి.ఐ.జీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story