Coronavirus Updates in AP: ఏపీలో అయిదు లక్షలకు చేరిన కరోనా కేసులు!

Coronavirus Updates in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,368 కేసులు నమోదు అయ్యాయి..

Krishna
Published on: 7 Sept 2020 6:37 PM IST
Coronavirus Updates in AP:  ఏపీలో అయిదు లక్షలకు చేరిన కరోనా కేసులు!
X

Coronavirus 

Coronavirus Updates in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,368 కేసులు నమోదు అయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,06,493 కి చేరుకుంది. ఇందులో 97,932 యాక్టివ్ కేసులు ఉండగా, 4,04,074 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రములో గడిచిన 24 గంటల్లో 70 మంది కరోనా నుంచి మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 4,487కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

ఇక జిల్లాల వారిగా లెక్కలు చూసుకుంటే..అనంతపురంలో 584, చిత్తూరులో 875, ఈస్ట్ గోదావరిలో 1312, గుంటూరులో 765, కడపలో 447, కృష్ణ 193, కర్నూల్ లో 316, నెల్లూరు 949, ప్రకాశం 419, శ్రీకాకుళం 559, విశాఖపట్నం 405, విజయనగరం 594, వెస్ట్ గోదావరిలో 950 కేసులు నమోదు అయినట్టుగా వెల్లడించింది.

ఇక ప్రకాశం జిల్లాలో 10 మంది, గుంటూరు 9, చిత్తూరు 8, కడప 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, నెల్లూరు 5, అనంతపురం 4, కర్నూలు 4, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 41,66,077 పరీక్షలను నిర్వహించారు.





Krishna

Krishna

Next Story