Coronavirus Updates In AP: ఏపీలో కొత్తగా 8,096 కరోనా కేసులు నమోదు..

Coronavirus
Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,096
Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,096 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,09,558 కు చేరుకుంది. ఇందులో 84,423 యాక్టివ్ కేసులో ఉండగా, 5,19, 891మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 67 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,244కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 74,710 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 49,59,081 కి చేరుకుంది..ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1405 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 463, చిత్తూరులో 902, గుంటూరులో 513, కడపలో 419, కృష్ణా జిల్లాలో 487, కర్నూలు జిల్లాలో మరో 337, నెల్లూరులో 468, ప్రకాశంలో 713, శ్రీకాకుళంలో 496, విశాఖపట్నంలో 371, విజయనగరంలో 487, వెస్ట్ గోదావరి లో 1035 కేసులు నమోదయ్యాయి..ఇక కడప జిల్లాలో 8, చిత్తూరు 7, కృష్ణా 7, తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, నెల్లూరు 5, శ్రీకాకుళం 5, పశ్చిమగోదావరి 4, ప్రకాశం 3, విజయనగరం 3, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు.