Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,073 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,073 కరోనా కేసులు నమోదయ్యాయి..

S. Srikanth
Published on: 25 Sept 2020 6:19 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,073 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,073 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,61,458కు చేరుకుంది. ఇందులో 67,683 యాక్టివ్ కేసులో ఉండగా 5,88,169 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 48 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,606కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 69,429 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 54,47,796 కి చేరుకుంది.. 8,695 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1031 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 556, చిత్తూరులో 713, గుంటూరులో 553, కడపలో 368, కృష్ణా జిల్లాలో 423, కర్నూలు జిల్లాలో మరో 205, నెల్లూరులో 459, ప్రకాశంలో 806, శ్రీకాకుళంలో 430, విశాఖపట్నంలో 340, విజయనగరంలో 378, పచ్చిమ గోదావరి లో 931 కేసులు నమోదయ్యాయి.. ఇక చిత్తూరు 08, ప్రకాశం 08, అనంతపురం 06, కృష్ణా 05, పశ్చిమగోదావరి 05, విశాఖపట్నం 03, కడప జిల్లాలో 03, నెల్లూరు 03, గుంటూరు 02, తూర్పుగోదావరి 02, కర్నూలు జిల్లాలో 02, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 92,173, కర్నూల్ జిల్లా 55,250, అనంతపురం జిల్లా 55,216, పచ్చిమ గోదావరి జిల్లా 62,582, చిత్తూర్ జిల్లా 58,268, విశాఖపట్నం జిల్లా 48,589, గుంటూరు జిల్లాలో 53,216, నెల్లూరు లో 50,027, కడప 41,852, ప్రకాశం జిల్లాలో 44,443, శ్రీకాకుళం 37,784, విజయనగరం 33,359, కృష్ణా జిల్లాలో 25,704 కేసులు నమోదయ్యాయి.




S. Srikanth

S. Srikanth

Next Story