Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 6,224 పాజిటివ్ కేసులు!

Coronavirus
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రములో కొత్తగా 6,224 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రములో కొత్తగా 6,224 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 72,861 శాంపిల్స్‌ని పరీక్షించగా 6,224 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. ఇక కరోనా నుంచి 7,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 5, గుంటూరులో 4, ప్రకాశంలో 4, విశాఖపట్నంలో 4, నెల్లూరు 3, అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరేసి, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 7,13,014కి చేరుకుంది. ఇందులో 55, 282 యాక్టివ్ కేసులు ఉండగా, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,51,791కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5941 కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,21,395 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
#COVIDUpdates: 03/10/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 3, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,10,119 పాజిటివ్ కేసు లకు గాను
*6,48,896 మంది డిశ్చార్జ్ కాగా
*5,941 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 55,282#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gGieud0VZf