Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,794 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 6 Sept 2020 6:16 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,794 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,794 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,623 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,794 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 11,915 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 09, అనంతపురం 08, ప్రకాశం 08, గుంటూరు 08, కడప 07, తూర్పుగోదావరి 05, పశ్చిమగోదావరి 05, విశాఖపట్నం 05, నెల్లూరు 04, కృష్ణా 04, కర్నూలు 04, శ్రీకాకుళం 02, విజయనగరం జిల్లాలో 01 చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,98,125. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,417. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,94,019కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 99,689 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 41,07,890 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 66,948, కర్నూల్ జిల్లా 48,386, అనంతపురం జిల్లా 45,300, పచ్చిమ గోదావరి జిల్లా 42,903, చిత్తూర్ జిల్లా 45,561, విశాఖపట్నం జిల్లా 40,787, గుంటూరు జిల్లాలో 40,135, నెల్లూరు లో 37,278 కేసులు నమోదయ్యాయి.




S. Srikanth

S. Srikanth

Next Story