ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,726 కరోనా టెస్టులు చేయగా, 3,620 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 22 Oct 2020 6:05 PM IST
ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు
X

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,726 కరోనా టెస్టులు చేయగా, 3,620 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,94,024 కి చేరుకుంది. అయితే ఇందులో 32,257 యాక్టివ్ కేసులుండగా, 7,55,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే 6,524 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 16 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,524కి చేరుకుంది.

కరోనాతో అత్యధికంగా గుంటూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 196, చిత్తూరులో 412, ఈస్ట్ గోదావరిలో 492, గుంటూరులో 385, కడపలో 212, కృష్ణాలో 370, కర్నూల్ లో 66, నెల్లూరులో 126, ప్రకాశంలో 311, శ్రీకాకుళం 126, విశాఖపట్నం 171, విజయనగరం 122, వెస్ట్ గోదావరి 631 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఎపీలో 73,47,776 కరోనా టెస్టులు నిర్వహించారు.





Krishna

Krishna

Next Story