Paderu: సమన్వయంతో కరోనా కట్టడికి చర్యలు

మన్యంలో కరోనా విస్తరించకుండా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఐటిడిఎ పిఒ డికె.బాలాజీ అన్నారు.

S. Srikanth
Updated on: 24 March 2020 4:11 PM IST
Paderu: సమన్వయంతో కరోనా కట్టడికి చర్యలు
X

పాడేరు: మన్యంలో కరోనా విస్తరించకుండా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఐటిడిఎ పిఒ డికె.బాలాజీ అన్నారు. మంగళవారం ఐటిడిఎ కార్యాలయం నుంచి 11మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలు, పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏజెన్సీలో 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలన్నారు.. పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఏజెన్సీకి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని ఐసోలేషన్‌ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story