ఏపీలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైంది.. జవహర్ రెడ్డి

ఏపీలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైంది.. జవహర్ రెడ్డి
x
corona virus in andhra prades (representational image)
Highlights

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో మరో దశలోకి ప్రవేశించినట్టు చెబుతున్నారు. ఈ విషయంపై ద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ...

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో మరో దశలోకి ప్రవేశించినట్టు చెబుతున్నారు. ఈ విషయంపై ద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని చెప్పారు. అయితే, ఇంకా అది ప్రాధమిక స్థాయిలోనే ఉన్నట్టు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రెండు నుంచి మూడు లక్షల ర్యాపిడ్ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. ఆ తరువాతే పరిస్థితిపై పూర్తి అవగాహన వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 14 వ తేదీ తరివాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడం సాధ్యపడక పోవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు వంటి చోట్ల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఇంకా ఆయన ఏమన్నారంటే..

కొవిడ్‌ లక్షణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేకసర్వే చేశాం. 5వేల మందిని గుర్తించాం. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. మూడు లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకున్తున్నామన్నారు. టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్ సెంటర్లలో కరోనా పరీక్షాలు చేయొచ్చని ఐసీఎంఆర్‌ చెప్పిందన్నారు. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు సిద్ధం చేస్తున్నాం. 40లక్షల గ్లోవ్స్‌, 12 లక్షల సర్జికల్‌ మాస్క్‌లు ఉన్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్‌ 14 లక్షలు సిద్ధంగా ఉంచామనీ వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories