Giddalur: నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం మూసివేత
మండలంలోని పుల్లల చెరువు సమీపంలోని నల్లమల అడవులలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు మూసి వేస్తున్నారు.
రాచర్ల: మండలంలోని పుల్లల చెరువు సమీపంలోని నల్లమల అడవులలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు మూసి వేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కరోనా వైరస్ ను నిరోధించేందుకు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఆదేశాలతో ఈ నెల 31వ తేదీ వరకు ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో చెన్నకేశవ రెడ్డి తెలిపారు.అయితే ఆలయం మూసి వేసినట్లుగా ముందుగా సమాచారం లేని భక్తులు నేడు శనివారం కావడంతో స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు ఆలయంలోకి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
Next Story




