Corona Cases in AP: ఏపీలో ఇంకా అదుపులోకి రాని కరోనా మరణాలు

కొత్తగా 2526 కేసులు, 24మంది మృతి ప్రకాశంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు మృత్యువాత చిత్తూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు మృతి

Sandeep Reddy
Updated on: 15 July 2021 8:00 PM IST
Corona Cases Not Yet Under Control in Andhra Pradesh
X

కరోనా వైరస్(ఫైల్ ఫోటో) 

Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృత్యు ఘోష కొనసాగుతోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. గత 24గంటల్లో కొత్తగా 2వేల 526 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు మృత్యువాత పడగా గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. ఇక, అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖలో ఒక్కొక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25వేల 526 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story