Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో 50 వేలు దాటిన కరోనా కేసులు..

Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 33580 సాంపిల్స్‌ ని పరీక్షించగా 4,047 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

S. Srikanth
Updated on: 20 July 2020 11:04 PM IST
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో 50 వేలు దాటిన కరోనా కేసులు..
X
Representational Image

Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 33580 సాంపిల్స్‌ ని పరీక్షించగా 4,047 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 1,335 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో 09, గుంటూరు లో 09, కృష్ణ 07, అనంతపురం 06, చిత్తూరు 05, శ్రీకాకుళంలో 05, విశాఖపట్నం 05, క పచ్చిమ గోదావరి 03, కడప 01, వవిజయనగరం లో 01 మృతి చెందారు.

నేటివరకు రాష్ట్రంలో 13,49,112 సాంపిల్స్‌ ని పరీక్షించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 53,829 పాజిటివ్ కేసు లకు గాను.. 2895 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 696 మంది మరణించారు. ప్రస్తుతం కేసులతో కలిపి రాష్ట్రంలో 28,469 యాక్టివే కేసులు ఉన్నాయ్. ఇక కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటివరకు 21664 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విదుల చేసింది.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 40,425 కేసులు నమోదు కాగా, 681 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 11,18,043 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,90,459 ఉండగా, 7,00,086 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 27,497 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,56,039 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,40,47,908 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.





S. Srikanth

S. Srikanth

Next Story