Narsipatnam: చిత్రపటం తొలగింపుపై ఆందోళన : కమిషనర్ హామీతో సమసిన వివాదం

దశాబ్ధాల క్రితం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసి అప్పట్లో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్సీ లత్సాపాత్రుడు ఫొటో ఎందుకు తొలగిస్తారంటూ తెలుగు దేశం పార్ఠీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు

admin1
Updated on: 15 Jun 2020 3:13 PM IST
Narsipatnam: చిత్రపటం తొలగింపుపై ఆందోళన : కమిషనర్ హామీతో సమసిన వివాదం
X

దశాబ్ధాల క్రితం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసి అప్పట్లో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్సీ లత్సాపాత్రుడు ఫొటో ఎందుకు తొలగిస్తారంటూ తెలుగు దేశం పార్ఠీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీనికి మద్దతుగా మాజీ మంత్రి వచ్చి నాయకులనుద్దేశించి మాట్లాడారు. లత్సాపాత్రుడు నర్సీపట్నం అభివృద్దికి పనిచేసిన కారణంగా అప్పట్లో ఏకగ్రీవ తీర్మానంతో పంచాయతీ ఆఫీసు, కో ఆపరేటివ్ బ్యాంకు, క్లబ్ ల్లో ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేశారన్నారు. అలాంటి ఫొటోను ఎవరికి చెప్పకుండా ఎలా తొలగిస్తారని కమీషనర్ ను ప్రశ్నించారు. తీర్మానాన్ని గౌరవించకుండా కమీషనర్ ఎందుకు తొలగంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫొటో తొలగించిన కమీషనర్ ఎవరి అనుమతితో తొలగించారో చెప్పాలన్నారు. కమీషనర్ ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరించడం వల్లే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు. దీన్ని వెంటనే అక్కడ ఏర్పాటు చేయకపోతే భవిషత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దీనిపై కమీషనర్ కృష్ణవేణి మాట్లాడుతూ కార్యాలయానికి రంగులు వేసే కార్యక్రమం ఉండటంతో అక్కడి నుంచి తీసేశామని, అవి పూర్తయిన వెంటనే మరలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కమీషనర్ ఇచ్చిన హామీతో వెంటనే ఆందోళన విరమించారు.

admin1

admin1

Next Story