Chandrababu Naidu: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ ఘటనలో విచారణకు సీఎం ఆదేశం

Chandrababu Naidu: విద్యార్థులు ఎవరూ అధైర్య పడొద్దని సీఎం చంద్రబాబు హామీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2024 6:24 PM IST
CM orders investigation into the Gudlavalleru Engineering College incident
X

Chandrababu Naidu: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ ఘటనలో విచారణకు సీఎం ఆదేశం

Chandrababu Naidu: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజి గల్స్ బాత్‌రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు జరపాలని ఆదేశించారు.

రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో.. నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. విద్యార్థులు ఎవరూ అధైర్య పడొద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story