CM Jagan: రేపు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం జగన్

CM Jagan: విద్యాదీవెన పథకం నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్న సీఎం

Jyothi
Published on: 23 May 2023 3:16 PM IST
CM Jagan will visit Kovvur in East Godavari District Tomorrow
X

CM Jagan: రేపు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం జగన్

CM Jagan: రేపు సీఎం వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నగదును సీఎం జగన్...లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం జగన్ కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.

Jyothi

Jyothi

Next Story