CM Jagan: అప్పుడే విశాఖకు వెళ్లబోతున్నాం.. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి..

CM Jagan: ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్, మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు.

Arun Chilukuri
Published on: 14 March 2023 3:50 PM IST
CM Jagan Warns His Cabinet Ministers
X

CM Jagan: అప్పుడే విశాఖకు వెళ్లబోతున్నాం.. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి..

CM Jagan: ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్, మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు. జులై నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని జగన్ మంత్రులకు చెప్పారు. 7 స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గెలవాలన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. గత నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామో.. అసెంబ్లీ వేదికగా అంశాలవారీగా మాట్లాడాలని మంత్రులకు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story